Abn logo
Oct 21 2021 @ 00:28AM

మహనీయుడు మహర్షి వాల్మీకి : అదనపు కలెక్టర్లు

నల్లగొండలో వాల్మీకి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న అదనపు కలెక్టర్లు

ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌ వర్క్‌: రామాయణం మహాకావ్యాన్ని రచిం చిన మహర్షి వాల్మీకి మహనీయుడని అదనపు కలెక్టర్లు  రాహుల్‌శర్మ, చంద్రశేఖర్‌ అన్నారు. వాల్మీకి జయంతిని కలెక్టరేట్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డు ఐఏఎస్‌ అధికారి చొల్లేటి ప్రభాకర్‌, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి మోతీలాల్‌, బీసీ డీఈవో కృష్ణవేణి పాల్గొన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి అదనపు ఎస్పీ నర్మద పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. వాల్మీకి జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, డీపీవో ఏవో మంజుభార్గవి, సూపరింటెండెంట్లు అతిఖుర్‌ రెహమాన్‌, దయాకర్‌రావు, ఆర్‌ఐలు స్పర్జన్‌రాజ్‌, నర్సింహాచారి, శ్రీనివాస్‌ ఉన్నారు. మిర్యాలగూడలో ముని సిపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌ వాల్మికీ చిత్రపటానికి నివాళుల ర్పించారు. పీఏపల్లిలో తహసీల్దార్‌ రాధ వాల్మీకిమహర్షి చిత్ర పటానికి నివాళులర్పించారు. డిండిలోని ఎంపీడీవో కార్యాలయంలో వాల్మీకి జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీవో కే ధరినాధ్‌, సర్పంచ్‌ సాయమ్మ, ఎంపీటీసీ రాధిక, శివనందం, రాజు, రామస్వామి పాల్గొన్నా రు. మర్రిగూడలో బీజేపీ కార్యాలయం వద్ద వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో దళితమోర్చ అధ్యక్షులు గ్యార గోపాల్‌, బోయపల్లి రాజు, వెంకన్న, లింగస్వామి, పెద్దులు, రమేష్‌, సుమన్‌, సురేష్‌ పాల్గొన్నారు. చింతపల్లి మండలంలో వాల్మీకి జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్రనేత కంకనాల వెంకట్‌రెడ్డి, దొంతం చంద్రశేఖర్‌రెడ్డి, నట్వ గిరిధర్‌, అండేకార్‌ అశోక్‌, ఎండి.ఖాలేద్‌, కుంభం శ్రీశైలంగౌడ్‌ పాల్గొన్నారు. కన గల్‌ ఎంపీడీవో కార్యాలయంలో వాల్మీకీ జయంతి నిర్వహించారు. కార్య క్రమంలో ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కరీంపాష, ఎంపీడీవో సోమసుందర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ అల్తాఫ్‌అహ్మద్‌, సర్పంచ్‌ కరుణశ్రీరవి ఉన్నారు. చిట్యాల మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కమిషనర్‌ రామదుర్గారెడ్డి కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, రెమిడాల లింగస్వామి పాల్గొన్నారు. నేరేడు గొమ్ములో వాల్మీకి చిత్రపటానికి జడ్పీటీసీ కేతావత్‌ బాలు నివాళుల ర్పించారు. దేవరకొండ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ జాన్‌యా దవ్‌, పంచాయతీ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.