Advertisement
Advertisement
Abn logo
Advertisement

వాటితో జ్ఞాపకశక్తి పెరుగుతుందా? లేదా?

ఆంధ్రజ్యోతి(03-10-2020)

ప్రశ్న: మాకు మూడేళ్ల కవల పిల్లలు. వారికి రోజూ గుప్పెడు గుమ్మడి గింజలు, పది బాదం గింజలు, కొద్దిగా 3 ఒమేగా-3 టానిక్ ఇస్తున్నాం. భవిష్యత్తులో వీరి ఐక్యూ, జ్ఞాపకశక్తి బాగా పెరుగుతాయా?


- వేణు, నెల్లూరు


డాక్టర్ సమాధానం: పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేయడం మంచి పని. సప్లిమెంట్లు మాత్రమే కాక గుమ్మడి గింజలు, అవిసె గింజలు, ఆక్రోట్ గింజలు మొదలైనవాటిలో కూడా ఒమోగా-3 ఫాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్‌లో చేపనూనెలో లభించే డేకోసాహెక్సానోయిక్ యాసిడ్(DHA), ఐకోసాపెంటానోయిక్ యాసిడ్ (EPA) మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. బాదం, ఆక్రోట్, పిస్తా, గుమ్మడిలాంటి పప్పుల్లో ఫాటీ యాసిడ్స్‌తో పాటు వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు ఉంటాయి. పిల్లల దినసరి ఆహారంలో వీటిని భాగం చేస్తే మంచిది. వీటితో పాటుగా కాయగూరలు, పండ్లు, ఆకుకూరలు, పాలు, పెరుగు మొదలైనవి కూడా తప్పనిసరిగా ఇవ్వాలి.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)

Advertisement

పిల్లల సంరక్షణమరిన్ని...

Advertisement