మచ్చలు పోవాలంటే...

ABN , First Publish Date - 2021-07-18T06:11:15+05:30 IST

మచ్చలు, మొటిమలు ముఖారవిందాన్ని దెబ్బతీస్తాయి. అయితే వీటిని తగ్గించుకోవడం కోసం క్రీములు, లోషన్లు అవసరం లేదు.

మచ్చలు పోవాలంటే...

చ్చలు, మొటిమలు ముఖారవిందాన్ని దెబ్బతీస్తాయి. అయితే వీటిని తగ్గించుకోవడం కోసం క్రీములు, లోషన్లు అవసరం లేదు. ఇంట్లో లభించే పదార్థాలతో వాటిని పోగొట్టుకుని ముఖారవిందాన్ని పెంచుకోవచ్చు. 


బంగాళదుంప మచ్చలను పోగొడుతుంది. బంగాళదుంపను కట్‌ చేసి మచ్చలున్న చోట పెట్టి కాసేపు వదిలేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. బంగాళదుంపను గుజ్జుగా చేసి, అందులో ఒక టీస్పూన్‌ తేనె కలిపి మచ్చలున్న చోట రాసి పావుగంట వదిలేయాలి. తరువాత నీటితో కడుక్కోవాలి. 

కాస్త మజ్జిగ, రెండు టీస్పూన్ల టొమాటో జ్యూస్‌ను కలిపి ముఖానికి రాసుకోవాలి. పావుగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. వారంలో రెండు సార్లు ఇలా చేయాలి.

ఒక టేబుల్‌స్పూన్‌  పెరుగులో కొద్దిగా నిమ్మరసం వేసి మచ్చలున్న చోట అప్లై చేసినా స్కిన్‌ టోన్‌ బ్యాలెన్స్‌ అవుతుంది.

ఓట్స్‌ను గ్రైండ్‌ చేసి రెండు టీస్పూన్ల నిమ్మరసం వేసి పేస్టులా చేసి ముఖంపై మర్దనలా చేసుకోవాలి. పావుగంట తరువాత నీటితో కడిగేసుకోవాలి. వారంలో ఒకటి రెండు సార్లు ఇలా చేయడం మంచి ఫలితం కనిపిస్తుంది.

రెండు టేబుల్‌స్పూన్ల పాలలో ఒక స్పూన్‌ తేనె వేసి దూదితో మచ్చలున్న చోట అప్లై చేయాలి. పది నిమిషాల తరువాత క్లీన్‌ చేసుకోవాలి. ఈ చిట్కా మచ్చలు త్వరగా పోగొడుతుంది. పాలలో ఒక టీస్పూన్‌ పసుపు వేసి ఉపయోగించినా ఫలితం ఉంటుంది.

అలొవెరా జెల్‌ను వేళ్లతో నెమ్మదిగా మచ్చలున్న చోట మసాజ్‌లా చేసుకోవాలి. రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే కొన్ని వారాల్లోనే ఫలితం చూడొచ్చు.

బొప్పాయిని గుజ్జుగా చేసి ఒక టీస్పూన్‌ నిమ్మరసం వేసి ముఖానికి రాసుకోవాలి. పావుగంట తరువాత కడిగేసుకుంటే సరి.

మచ్చలున్న చోట రోజుకు రెండు మూడు సార్లు ఉల్లిపాయతో రబ్‌ చేస్తే ఫలితం ఉంటుంది.

Updated Date - 2021-07-18T06:11:15+05:30 IST