రక్తహీనత పోవాలంటే...!

ABN , First Publish Date - 2021-04-05T05:45:22+05:30 IST

రక్తహీనత సాధారణంగా కనిపించే సమస్య. అయితే దీన్ని నిర్లక్ష్యం చేస్తే అనేక ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వారు తీసుకునే ఆహారంపై కొంచెం శ్రద్ధ పెడితే సులువుగా ఈ సమస్య నుంచి బయటపడే వీలుంది.

రక్తహీనత పోవాలంటే...!

రక్తహీనత సాధారణంగా కనిపించే సమస్య. అయితే దీన్ని నిర్లక్ష్యం చేస్తే అనేక ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రక్తహీనతతో బాధపడే వారు తీసుకునే ఆహారంపై కొంచెం శ్రద్ధ పెడితే సులువుగా ఈ సమస్య నుంచి బయటపడే వీలుంది. 


  • రక్తహీనత ఉన్న వారు ఐరన్‌ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. శాకాహారులయితే సోయాబీన్స్‌, పప్పు దినుసులు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ప్రొటీన్‌ ఎక్కువగా లభిస్తుంది. 
  • మాంసాహారులయితే రోజూ ఒక కోడిగుడ్డు తినాలి. దీనివల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ లభిస్తుంది. 
  • రక్తహీనత తగ్గాలంటే హీమోగ్లోబిన్‌ శాతం పెరగటంతో పాటు ప్రొటీన్‌, ఐరన్‌ శాతం పెరగాలి. ధాన్యాలు, రాగులు, గోధుమలలో ఐరన్‌ ఎక్కువగా లభిస్తుంది. ఆకుకూరల వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. 
  • ఆహారంలో చింతపండు బదులుగా నిమ్మకాయ, టొమాటో ఉపయోగించాలి. దీనివల్ల ఐరన్‌ గ్రహించే శక్తి పెరుగుతుంది. 
  • ఫ్రూట్స్‌ విషయానికొస్తే దానిమ్మ, పుచ్చకాయ బాగా ఉపయోగపడతాయి. డ్రైఫ్రూట్స్‌లో జీడిపప్పు, బాదం తీసుకుంటే తగినంత శక్తి లభిస్తుంది. వీటితో పాటు పాలు తప్పకుండా తాగాలి. పాలు లేదా పెరుగు రూపంలో  తీసుకోవాలి. 
  • బెల్లం తింటే ఐరన్‌ లభిస్తుంది. కానీ శరీరం గ్రహించే శాతం తక్కువగా ఉంటుంది. అందుకే ఆహారంలో విటమిన్‌ సి కంటెంట్‌ ఉండేలా చూసుకుంటే ఐరన్‌ గ్రహించే శక్తి బాగా ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రక్తహీనత సమస్య తొలగిపోతుంది.

Updated Date - 2021-04-05T05:45:22+05:30 IST