TS News: సోనియా కుటుంబాన్ని మానసికంగా ఇబ్బంది పెట్టేందుకే.. Jeevan Reddy

ABN , First Publish Date - 2022-07-21T22:50:50+05:30 IST

హైదరాబాద్: డబ్బు బదలాయింపు లేకున్నా..సోనియా కుటుంబంపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి కేంద్రం వేధింపులకు గురిచేస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. మానసికంగా ఇబ్బంది పెట్టి.. గాంధీ

TS News:  సోనియా కుటుంబాన్ని మానసికంగా ఇబ్బంది పెట్టేందుకే..  Jeevan Reddy

హైదరాబాద్: డబ్బు బదలాయింపు లేకున్నా..సోనియా కుటుంబంపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి కేంద్రం వేధింపులకు గురిచేస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. మానసికంగా ఇబ్బంది పెట్టి.. గాంధీ కుటుంబం దేశం విడిచిపోయేలా చేయాలని కేంద్రం భావిస్తోందని చెప్పారు. సోనియా గాంధీ కుటుంబానికి పార్టీ నాయకులు, శ్రేణులు అండగా ఉంచాయన్నారు. 


ఈడీ కేసు గురించి క్లుప్తంగా..

నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక ఆస్తులను ఆయాచితంగా పొందారని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. మాజీ ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇతర స్వాతంత్ర సమరయోధులు కలిసి 1938లో ఈ పత్రికను స్థాపించారు. దీని ప్రచురణ సంస్థ అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌(ఏజేఎల్‌)కు హిందీ, ఉర్దూలలోనూ మరో రెండు పబ్లికేషన్లు ఉన్నాయి. రూ.90 కోట్లకు పైగా అప్పులు పేరుకుపోవడంతో 2008లో ఈ పత్రిక మూతపడింది. ఒక పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీ(ఏజేఎల్‌)ని ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ(యంగ్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌-వైఐఎల్‌) ద్వారా సొంతం చేసుకున్నారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. ఏజేఎల్‌ బకాయి పడిన రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందడానికి వైఐఎల్‌ ద్వారా రూ.50 లక్షలు చెల్లించి.. కుట్ర, మోసం, నిధుల దుర్వినియోగానికి వీరు పాల్పడ్డారన్నారు. 

Updated Date - 2022-07-21T22:50:50+05:30 IST