Sep 21 2021 @ 07:36AM

ప్రజలను మోసం చేయడానికే: సి కళ్యాణ్

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్లను ఆన్ లైన్ ద్వారా విక్రయించే అంశంపై ఏపీ మంత్రి పేర్ని నానితో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, నిర్మాత సి.కళ్యాణ్, ఆదిశేషగిరిరావు, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు, డివివి దానయ్య,  రామ సత్యనారాయణ, ముత్యాల రామదాసులతో పాటు పంపిణీ దారులు, థియేటర్ యజమానులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా సి. కళ్యాణ్ మాట్లాడుతూ.."మాలో తప్పులు జరగలేదని కాదు డెఫినెట్‌గా తప్పులు జరిగినవి. ఎందుకనంటే ఇంతకముందు ఫైనాన్స్ మినిస్టర్‌ దగ్గరికి రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళాము సార్. మీటింగ్ పెట్టగానే ఇలా తీసేశారు ఫైళ్లు..ప్రతీ ఒక్క యాడ్‌లో 200 కోట్లు, 600 కోట్లు, 2000 కోట్లు కలెక్షనని, బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అని. ఇదేంటయా ఇట్లుంటే మీరెందుకొచ్చి మమ్మిలిని ఇబంది పెడుతున్నారు అని అన్నారు. ఎందుకనంటే, మేమంతా చేసేది ప్రజల్ని మోసం చేయటానికి. అబ్బో ఈ సినిమా చూడకపోతే మిస్ అయిపోతావేమోనని చూపించడానికే సార్. ఇది ఓన్లీ సినిమా అనే కలర్‌ఫుల్ మాయలే సార్. ఆ మాయలే ఈ ఫిగర్లు. అలా అని ఆడిన సినిమాలున్నాయి. ఇప్పుడు మీరు చెప్పారు 'జాతి రత్నాలు' అనే సినిమా గురించి. చాలా చిన్న సినిమా..చాలా ఎక్కువ కలెక్ట్ చేసింది. మాకు ఇంకా వేరే వేరేటువంటివి లేవు సార్. ఆ రోజు సీఎం గారు ఇమ్మీడియట్‌గా మిమ్మలినే చూడమన్నారు".. అని చెప్పుకొచ్చారు.