గొంతు తడుపుకోవాలని..

ABN , First Publish Date - 2021-05-06T04:44:09+05:30 IST

వేసవి నేపథ్యంలో ఎండలు మండుతున్నాయి. రోజూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చెరు వులు, నదుల్లో నీరు ఇంకి పోతోంది.

గొంతు తడుపుకోవాలని..
కొళాయి నీటిని తాగుతున్న ఆవుదూడ

గుర్ల : వేసవి నేపథ్యంలో ఎండలు మండుతున్నాయి. రోజూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చెరు వులు, నదుల్లో నీరు ఇంకి పోతోంది. అంతటా నీటి ఎద్దడి నెలకొంది. ఈ క్రమం లో పశువులు కూడా తాగునీటికి ఇబ్బంది పడుతున్నాయి. బుధవారం పల్లిగండ్రేడులో కనిపించిన దృశ్యమే ఇందుకు నిదర్శనం. పొలాల్లో నుంచి ఊర్లోకి వచ్చిన ఓ ఆవు దూడ కొళాయి వద్ద ఇలా తాగునీటికి అవస్థ పడుతోంది. గొంతు తడుపుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేసింది. ఇది చూసిన స్థానికులు తాగునీటికి ఎంత కష్టమొచ్చిందని విచారం వ్యక్తం చేశారు.  



Updated Date - 2021-05-06T04:44:09+05:30 IST