చోప్రాకు పరమ విశిష్ట సేవా పతకం

ABN , First Publish Date - 2022-01-26T09:18:45+05:30 IST

ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో దేశానికి గర్వకారణంగా నిలిచిన నీరజ్‌ చోప్రా పద్మశ్రీతో పాటు మరో అరుదైన పురస్కారానికి ఎంపికయ్యాడు.

చోప్రాకు   పరమ విశిష్ట   సేవా పతకం

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకంతో దేశానికి గర్వకారణంగా నిలిచిన నీరజ్‌ చోప్రా పద్మశ్రీతో పాటు మరో అరుదైన పురస్కారానికి ఎంపికయ్యాడు. రిపబ్లిక్‌ డేను పురస్కరించుకొని చోప్రాను ‘పరమ విశిష్ట సేవా పతకం’తో కేంద్ర ప్రభుత్వం  సత్కరించనుంది. నీరజ్‌ భారత ఆర్మీలో సుబేదార్‌ హోదాలో ఉన్నాడు. 2016లో ‘4 రాజ్‌పుతానా రైఫిల్స్‌’లో నైబ్‌ సుబేదార్‌ హోదాలో చోప్రా చేరాడు. పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో తన ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నాడు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో రక్షణ దళాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పతకాలను బహూకరించనున్నారు.  

Updated Date - 2022-01-26T09:18:45+05:30 IST