ఎయిడ్స్‌ రహిత జిల్లాగా మార్చాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-12-02T05:33:57+05:30 IST

జిల్లాను ఎయి డ్స్‌ రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు.

ఎయిడ్స్‌ రహిత జిల్లాగా మార్చాలి : కలెక్టర్‌
ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌, అధికారులు

కామారెడ్డి టౌన్‌, డిసెంబరు 1: జిల్లాను ఎయి డ్స్‌ రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. బుధవారం సమీకృత కలెక్టర్‌ కార్యాలయంలో ప్రపంచ ఎయిడ్స్‌ దినం సందర్భ ంగా జిల్లా వైద్యఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎయిడ్స్‌ను అరికట్టడంలో ప్రతీ ఒక్కరు కీలకపాత్ర పోషించాలని సూ చించారు. ఎయిడ్స్‌ వ్యాధి నివారణకు నిరంతరం పాటు పడాలని తెలిపారు. ఎయిడ్స్‌ ప్రాణాంతకమైన వ్యాధి కాదని, మందులు ఉన్నాయని వాటిని క్రమం తప్పకుండా వాడితే నివారణ చేయ డం సులభమన్నారు. 9 మంది గర్భిణుల కు ఎయిడ్స్‌ వ్యాధి ఉన్న వారి పిల్లలకు రాకుండా వైద్యశాఖ చర్యలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్టాళ్లను పరిశీలించారు. వ్యాసరచన, క్విజ్‌ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. రక్తదానం చేయడానికి యువకులు ముందుకు రావడం హర్షణీయమన్నారు. వారికి ప్రశంసా పత్రాలను అందించారు. అనంతరం ఎయిడ్స్‌ వ్యాధి నివారణపై ప్రతిజ్ఞ చేయడంతో పాటు గోడప్రతులను ఆవి ష్కరించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్‌ వైద్యాధికారి చంద్రశేఖర్‌, ఐసీడీఎస్‌ పీడీ సరస్వతీ, ఎయిడ్స్‌ నియంత్రణ ప్రోగ్రాం అధికారి మౌనిక, వైద్యురాలు విజయలక్ష్మీ, డిప్యూటీ డీఎంహెచ్‌వో శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-02T05:33:57+05:30 IST