Advertisement
Advertisement
Abn logo
Advertisement

హాస్టల్‌ విద్యార్థుల కోసం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ భిక్షాటన

చీమకుర్తి, డిసెంబరు 4 : హా స్టల్‌ విద్యార్థులకు మెస్‌, కాస్మో టిక్‌ ఛార్జిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రేవూ రి వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశా రు. హాస్టల్‌ విద్యార్థుల కోసం శని వారం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో చీమకుర్తిలో భిక్షాటన కార్యక్రమా న్ని నిర్వహించారు. హాస్టల్‌ విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదలివేయ టం అన్యాయమని, కనీసం వారికి దుప్పట్లు పంపిణీ చేయకపోవటం దారుణమని విమర్శించారు. తక్షణమే హాస్టల్స్‌లో మౌలిక వసతులు కల్పించి బకాయిలను చెల్లిం చాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గొల్లపూడి శ్రీనివాసరావు, ముప్పూరి చలమయ్య, రూపేష్‌, వాసు, సురేంద్ర, యలమంద, రాఘవేంద్ర, మనీ, ముకేష్‌, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement