AP News: జెఎన్టీయూ ముట్టడికి టీఎన్ఎస్ఎఫ్ యత్నం

ABN , First Publish Date - 2022-08-12T17:05:40+05:30 IST

జిల్లాలోని జేఎన్టీయూ (JNTU)ను ముట్టడించేందుకు టీఎన్ఎస్ఎఫ్ (TNSF) నాయకులు యత్నించారు.

AP News: జెఎన్టీయూ ముట్టడికి టీఎన్ఎస్ఎఫ్ యత్నం

అనంతపురం: జిల్లాలోని  జేఎన్టీయూ (JNTU)ను ముట్టడించేందుకు టీఎన్ఎస్ఎఫ్ (TNSF) నాయకులు యత్నించారు. జేఎన్టీయూ గేట్ల పైకెక్కి యూనివర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు టీఎన్ఎస్ఎఫ్ ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన జేఎన్టీయూ సూపరింటెండెంట్ ఎండీ నాగభూషణం పట్ల కక్ష సాధింపు ధోరణికి నిరసనగా వీసీ ఛాంబర్ ముట్టడించేందుకు ఆందోళనకారులు యత్నించారు.  టీఎన్ఎస్ఎఫ్ నేతలను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం డౌన్ డౌన్ అంటూ ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రెడ్ల రాజ్యంలో బీసీలను అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-08-12T17:05:40+05:30 IST