రెండేళ్ల తర్వాత కనికరించారు

ABN , First Publish Date - 2020-10-01T10:48:00+05:30 IST

దివ్యాంగుడు కొవ్వూరు కృష్ణారెడ్డికి ఎట్టకేలకు పింఛన్‌ మంజూరైంది. ఆంధ్రజ్యోతిలో ఆగస్టు 8న ‘జగన్‌ హామీకి - అధికారుల ఝలక్‌’ పేరిట ప్రచు రితమైన కథనానికి అధికారులు

రెండేళ్ల తర్వాత కనికరించారు

రెండేళ్ల తర్వాత కనికరించారు

 దివ్యాంగుడు కృష్ణారెడ్డికి పింఛన్‌ మంజూరు

 ఆంధ్రజ్యోతి కథనంతో కదిలిన యంత్రాంగం


పాలకొల్లు టౌన్‌, సెప్టెంబరు 30 : దివ్యాంగుడు కొవ్వూరు కృష్ణారెడ్డికి ఎట్టకేలకు పింఛన్‌ మంజూరైంది. ఆంధ్రజ్యోతిలో ఆగస్టు 8న ‘జగన్‌ హామీకి - అధికారుల ఝలక్‌’ పేరిట ప్రచు రితమైన కథనానికి అధికారులు స్పందించారు. పెనుమంట్ర మండలం నెగ్గిపూడికి చెందిన కృష్ణారెడ్డికి 25 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో పాదం నలిగిపోగా వికలాంగుల పింఛన్‌ ఇవ్వలే దు. ఇదే విషయాన్ని అప్పటి ప్రతిపక్షనేత జగన్‌ పాదయాత్ర లోను, సీఎం అయిన తర్వాత ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. పింఛన్‌ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ ఫలితం లేకపోయింది.


చివరకు ఆంధ్రజ్యోతిలో కథనం రావడంతో అధికారులు స్పం దించి మంజూరుచేశారు. బుధవారం గ్రామ కార్యదర్శి అల్లం భాస్కరరెడ్డి చేతుల మీదుగా పింఛన్‌ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2020-10-01T10:48:00+05:30 IST