నరసాపురం టు లింగంపల్లి

ABN , First Publish Date - 2020-10-01T10:51:04+05:30 IST

నరసాపురం టు హైదరాబాద్‌ వెళ్లే నరసాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ను లింగపల్లి వరకు పొడిగించారు.

నరసాపురం టు లింగంపల్లి

పునఃప్రారంభమైన తర్వాత ఎక్స్‌ప్రెస్‌ పొడిగింపు

నరసాపురం, సెప్టెంబరు 30 : నరసాపురం టు హైదరాబాద్‌ వెళ్లే నరసాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ను లింగపల్లి వరకు పొడిగించారు. 1979 లో ప్రారంభమైన ఈ ఎక్స్‌ప్రెస్‌ ఇప్పటి వరకు నరసాపురం నుంచి హైదరాబాద్‌ వరకు వెళుతోంది. తాజాగా దీనిని లింగంపల్లి వరకు పొడిగిస్తున్నట్టు స్టేషన్‌ మాస్టర్‌ మధుబాబు చెప్పారు. రైల్వే అధికారుల నుంచి ఉత్తర్వులు అందాయన్నారు.


లాక్‌డౌన్‌ కారణంగా మార్చి నెలాఖరు నుంచి ఈ ఎక్స్‌ప్రెస్‌ నడవడం లేదు. తిరిగి ప్రారంభమైన తరువాత కొత్త షెడ్యూల్‌ అమల్లోకి వస్తుందని చెప్పారు. సికింద్రాబాద్‌ నుంచి బేగంపేట మీదుగా లింగంపల్లి వెళుతుందన్నారు. తిరుగు ప్రయా ణంలోనూ అక్కడి నుంచి బయలుదేరుతుందని చెప్పారు. 

Updated Date - 2020-10-01T10:51:04+05:30 IST