Abn logo
Sep 13 2020 @ 16:30PM

ముగ్గురు వైద్య విద్యార్థుల ఆత్మహత్య

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. ముగ్గురు వైద్య విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) జరగడానికి ఒక రోజు ముందు ముగ్గురు వైద్య విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మదురైకి చెందిన 19 ఏళ్ల జోతి శ్రీ దుర్గా సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. మిగతా ఇద్దరు విద్యార్థుల కేసుల్లో సూసైడ్ నోట్స్ కనుగొనబడలేదు. వీరిని ధర్మపురి జిల్లాకు చెందిన ఓం ఆదిత్య, నామక్కల్ జిల్లాకు చెందిన ఎం మోతిలాల్‌గా గుర్తించారు.

Advertisement
Advertisement
Advertisement