తృణమూల్ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ సాయోని ఘోష్‌ను నిర్బంధించిన త్రిపుర పోలీసులు

ABN , First Publish Date - 2021-11-22T01:00:30+05:30 IST

తృణమూల్ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ సాయోని ఘోష్‌ను త్రిపుర పోలీసులు నిర్బంధించారు. అగర్తలలోని

తృణమూల్ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ సాయోని ఘోష్‌ను నిర్బంధించిన త్రిపుర పోలీసులు

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ సాయోని ఘోష్‌ను త్రిపుర పోలీసులు నిర్బంధించారు. అగర్తలలోని పోలీస్ స్టేషన్‌ వద్ద అధికార బీజేపీ కార్యకర్తలు తమపై దాడిచేసినట్టు టీఎంసీ కార్యకర్తలు ఆరోపించారు. పోలీస్ స్టేషన్ వద్ద వారి  సమక్షంలోనే తమపై కర్రలతో దాడిచేశారని, రాళ్లు విసిరారని పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. సాయాని ఘోష్ బస చేసిన హోటల్ వద్దకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు కోసం ఆమెను పిలిచారని, అయితే అందుకు కారణాన్ని మాత్రం వెల్లడించలేదని టీఎంసీ పేర్కొంది.


పోలీసులు పిలవడంతో సాయోని ఘోష్, కునాల్ ఘోష్ తదితర టీఎంసీ నేతలు అగర్తల ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆమె ఇంటరాగేషన్ కోసం లోపలికి వెళ్లిన తర్వాత హెల్మెట్లు ధరించిన 25 మంది బీజేపీ కార్యకర్తలు చేతుల్లో కర్రలతో అక్కడికి చేరుకుని తమపై కార్యకర్తలపై దాడిచేసినట్టు టీఎంసీ ఆరోపించింది.


ఈ ఘటనపై కునాల్ ఘోష్ మాట్లాడుతూ.. త్రిపురలో ‘ఆటవిక రాజ్యం’ ఉందన్నారు. పోలీసుల ఎదుటే తమపై దాడి జరిగిందని, అయినప్పటికీ వారు మౌనంగా ఉండిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక, బాధితులమైన తమపైనే కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-11-22T01:00:30+05:30 IST