పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడిపై దాడి

ABN , First Publish Date - 2022-03-07T20:44:05+05:30 IST

తృణమూల్ కాంగ్రెస్ గూండాలు తన కాన్వాయ్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంతా మజుందార్ ఆరోపించారు. బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా మధురాపూర్ వద్ద సోమవారం ఈ ఘటన జరిగినట్లు ఆయన చెప్పారు.

పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడిపై దాడి

తృణమూల్ కాంగ్రెస్ గూండాలు తన కాన్వాయ్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారని పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంతా మజుందార్ ఆరోపించారు. బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా మధురాపూర్ వద్ద సోమవారం ఈ ఘటన జరిగినట్లు ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా సుకాంతా తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో సుకాంతా కాన్వాయ్ వెళ్తుండగా, నల్ల జెండాలు పట్టుకున్న కొందరు వ్యక్తులు, ఆయన కారును అడ్డగించారు. సుకాంత గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ, దాడికి యత్నించారు. అయితే, పోలీసులు ఆందోళనకారులను పక్కకు తొలగించి, కాన్వాయ్ వెళ్లేలా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించవని, ఇలాంటి చర్యలతో బీజేపీని అడ్డుకోలేరని సుకాంతా అన్నారు. 

Updated Date - 2022-03-07T20:44:05+05:30 IST