Abn logo
Jul 31 2021 @ 12:20PM

కాళేశ్వరం పరివాహక ప్రాంత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి: కోదండరాం

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ప్రవాహంతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణం, నీటి నిర్వహణ పద్ధతుల్లో లోపాల కారణంగా ప్రతి ఏటా రైతుల పంట కోతకు గరువుతోందని తెలిపారు. మూడేళ్ళల్లో 7వేల ఎవరాల్లో పంటకు నష్టం వాటిల్లిందన్నారు. నీటి నిర్వహణలో సమూలంగా మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పంట నష్టపోకుండా ప్రభుత్వమే శాశ్వత పరిష్కారం చూపాలని కోందరాం పేర్కొన్నారు.