Abn logo
Mar 3 2021 @ 19:14PM

గౌతం కార్తీక్‌, శివాత్మిక చిత్రానికి టైటిల్‌ ఖరారు

శ్రీవారి ఫిల్మ్స్‌ నిర్మించే కొత్త చిత్రానికి ‘ఆనందం విలైయాడుం వీడు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. పి.రంగనాథన్‌ సమర్పణలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి నందా పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. కొంత విరామం తర్వాత ఈయన దర్శకత్వం వహిస్తున్నారు. గౌతం కార్తీక్‌, చేరణ్‌, సింగం పులి, శరవణన్‌, శివాత్మిక రాజశేఖర్‌, మౌనిక, జాక్వెలిన్‌, మన్య, సుజాత తదితరులు నటించే ఈ మూవీ పూర్తిగా కుటుంబ కథా చిత్రమని ఈ టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టరును చూడగానే తెలుస్తోంది. ఈ చిత్రానికి సిద్ధుకుమార్‌ సంగీతం దర్శకత్వం వహిస్తుండగా, బాలభరణి డీవోపీగా చేస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టరును ప్రముఖ హీరోలు విజయ్‌ సేతుపతి, పార్తీబన్‌, ఆర్య, ఆర్జే బాలాజీలు విడుదల చేశారు.

Advertisement
Advertisement
Advertisement