కార్తీక దీపోత్సవాలకు తిరువణ్ణామలై ముస్తాబు

ABN , First Publish Date - 2021-11-06T15:51:51+05:30 IST

తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం కార్తీక దీపోత్సవాలకు ముస్తాబవుతోంది. ఆలయ ప్రాంగణంలో విద్యుత్‌ కాంతులతో శోభిల్లుతున్న 9 గోపురాలకు సుమారు 20 కి.మీ పరిసర ప్రాంతాల పరిధిలోని ప్రజలు ఆనం

కార్తీక దీపోత్సవాలకు తిరువణ్ణామలై ముస్తాబు

పెరంబూర్‌(Chennai): తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం కార్తీక దీపోత్సవాలకు ముస్తాబవుతోంది. ఆలయ ప్రాంగణంలో విద్యుత్‌ కాంతులతో శోభిల్లుతున్న 9 గోపురాలకు సుమారు 20 కి.మీ పరిసర ప్రాంతాల పరిధిలోని ప్రజలు ఆనందంతో ఆస్వాదిస్తున్నారు. తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయ కార్తీక దీపోత్సవాలు ఈ నెల 10వ తేది ధ్వజా రోహణంతో ప్రారంభం కానున్నాయి. 19న 2,668 అడుగుల ఎత్తున్న కొండ శిఖరంపై మహాదీపం వెలిగించనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలోని 9 గోపురాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. 10 రోజులు జరిగే ఉత్సవాల్లో మాఢవీధుల్లో స్వామి ఊరేగింపు రద్దు చేసి, ఐదో ప్రాంగణంలో మాత్రమే నిర్వహించనున్నారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా రథోత్సవం రద్దు కాగా, 18న కార్తీక పౌర్ణమి, 19న మహాదీపం వేడుకల్లో గిరి ప్రదక్షిణకు భక్తులను అనుమతి లేదని ఆలయ నిర్వాహకులు ప్రకటించారు.

 7ను

Updated Date - 2021-11-06T15:51:51+05:30 IST