Tiruttani ఆలయానికి బంగారు పూత నెమలి వాహనం

ABN , First Publish Date - 2022-07-19T15:46:27+05:30 IST

తిరుత్తణి మురుగన్‌ ఆలయానికి బంగారు పూత పూసిన నెమలి వాహనాన్ని భక్తుడు విరాళంగా అందజేశారు. తిరువళ్లూర్‌ జిల్లా తిరుత్తణి సుబ్రమణ్యస్వామి

Tiruttani ఆలయానికి బంగారు పూత నెమలి వాహనం

ప్యారీస్‌(చెన్నై), జూలై 18: తిరుత్తణి మురుగన్‌ ఆలయానికి బంగారు పూత పూసిన నెమలి వాహనాన్ని భక్తుడు విరాళంగా అందజేశారు. తిరువళ్లూర్‌ జిల్లా తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆలయం ఆరు దివ్యక్షేత్రాల్లో ఐదవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆలయ ఉత్సవాల్లో ప్రసిద్ధిచెందిన తిరుకల్యాణం, మాఢవీధుల్లో స్వామివారు నెమలి,  భూత, అశ్వ, గజ, మూషిక, వృషభ, పులి తదితర వాహనాల్లో విహరిస్తుంటారు. ఈనేపథ్యంలో తమిళనాడు తొండ మండలం ఆది శైవ వేళాలర్‌ సంఘం ఆధ్వర్యంలో రూ.20 లక్షల వ్యయంతో బంగారు పూత పూసిన నెమలి వాహనాన్ని ఆదివారం ఆలయ అధికారులకు విరాళంగా అందజేశారు.

Updated Date - 2022-07-19T15:46:27+05:30 IST