7 వేల ఏళ్లనాటి రాతి పనిముట్లు లభ్యం

ABN , First Publish Date - 2021-01-25T11:59:13+05:30 IST

తిరుపత్తూర్‌ జిల్లా జువ్వాది కొండ ప్రాంతంలోని కీలానూరు ప్రాంతంలోని ఇళవనాచ్చియర్‌ ఆలయంలో ఏడువేల ఏళ్ల నాటి రాతి పరికరాలు లభ్యమయ్యాయి...

7 వేల ఏళ్లనాటి రాతి పనిముట్లు లభ్యం

చెన్నై/అడయార్‌ (ఆంధ్రజ్యోతి): తిరుపత్తూర్‌ జిల్లా జువ్వాది కొండ ప్రాంతంలోని కీలానూరు ప్రాంతంలోని ఇళవనాచ్చియర్‌ ఆలయంలో ఏడువేల ఏళ్ల నాటి రాతి పరికరాలు లభ్యమయ్యాయి. ఆ రాతిపరికరాలను పరిశీలించిన అధికారులు అవి 7 వేల ఏళ్ల నాటివని, ఆదిమానవులు వినియోగించారని గుర్తించారు. అలాగే, కొన్ని రాళ్లను కొడ వలిలా జంతువులు వేటాడేందుకు వినియోగించేవారని తిరుపత్తూర్‌ తూయనెంజై కళాశాల తమిళ శాఖ లెక్చరర్‌, పరిశోధకుడు మోహనగాంధీ తెలిపారు.

Updated Date - 2021-01-25T11:59:13+05:30 IST