పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం

ABN , First Publish Date - 2022-06-03T01:05:51+05:30 IST

తిరుమల వేంకటేశ్వర స్వామి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. గడిచిన రెండు నెలల తరహాలోనే మే నెలలో కూడా ఆదాయం భారీగా లభించింది.

పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం

తిరుమల: తిరుమల వేంకటేశ్వర స్వామి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. గడిచిన రెండు నెలల తరహాలోనే మే నెలలో కూడా ఆదాయం భారీగా లభించింది. మే నెలలో 22.68 లక్షల మంది భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకోగా,  రూ.129.57 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. 29వ తేదీన అత్యధికంగా 90,885 మంది దర్శించుకోగా, 25వ తేదీన రూ.5.43 కోట్లు హుండీ ఆదాయం లభించింది. మార్చి నెలలో 19.72లక్షలమంది దర్శించుకోగా,రూ.128.61 కోట్ల ఆదాయం సమకూరింది. ఏప్రిల్‌ నెలలో 20.62 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా, రూ.127.63 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. మే నెలలో భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. కరోనా ప్రభావం తగ్గడంతో పాటు వేసవి సెలవులు కూడా జతకావడంతో తిరుమల కొండ నిత్యం రద్దీతో కళకళలాడుతోంది. మొక్కులున్న భక్తులతో పాటు, ముడుపులనూ భారీగా  సమర్పిస్తున్న క్రమంలో హుండీ ఆదాయం పెరిగినట్టు తెలుస్తోంది. 

Updated Date - 2022-06-03T01:05:51+05:30 IST