Tirupati: స్విమ్స్ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స

ABN , First Publish Date - 2021-12-11T17:57:37+05:30 IST

నగరంలోని స్విమ్స్ ఆస్పత్రిలో అత్యంత క్లిష్టమైన, అరుదైన శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.

Tirupati: స్విమ్స్ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స

తిరుపతి: నగరంలోని స్విమ్స్ ఆస్పత్రిలో అత్యంత క్లిష్టమైన, అరుదైన శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.  కృష్ణా జిల్లా కైకలూరులో లక్ష్మణరావు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు ఇనుప కమ్మిపై పడ్డాడు. దీంతో లక్ష్మణరావు శరీరంలోకి మూడు అడుగుల కమ్మి ఇరుక్కుపోయింది. వెంటనే అతడిని స్విమ్స్‌కు తీసుకురాగా.. వైద్యులు శస్త్ర చికిత్స చేసి కమ్మిని విజయవంతంగా తొలగించారు. నాలుగు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహణ జరిగింది. స్వీమ్స్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం వైద్యులు ఈ ఆపరేషన్‌ను చేశారు. బాధితుడు లక్ష్మణరావు పూర్తి స్థాయిలో కోలుకున్నట్లు డైరెక్టర్ డాక్టర్. వెంగమ్మ, డాక్టర్ వి.వెంకటరామిరెడ్డి మీడియాకు వెల్లడించారు. 


Updated Date - 2021-12-11T17:57:37+05:30 IST