తిరుపతి: స్విమ్స్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవ శిలాఫలకం వివాదాస్పదమవుతోంది. శిలాఫలకంపై తమ పేర్లు లేవంటూ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేరుతో శిలాఫలకం ఏర్పాటు చేయడంపై స్విమ్స్ డైరక్టర్ వెంగమ్మపై భూమన, చెవిరెడ్డి మండిపడ్డారు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోరా అని ఎమ్మెల్యే భూమన అసహనం వ్యక్తం చేశారు.