తిరుపతి విద్యార్థికి ఐసెట్‌లో ఫస్ట్‌ ర్యాంకు

ABN , First Publish Date - 2022-08-09T07:04:58+05:30 IST

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 25న నిర్వహించిన ఐసెట్‌ ఫలితాలను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. తిరుపతికి చెందిన రెడ్డెప్పగారి కేతన్‌ 180.55 మార్కులతో ఫస్ట్‌ ర్యాంకు సాధించారు. చిత్తూరుకు చెందిన టి.పద్మావతి 153.65 మార్కులతో రాష్ట్రస్థాయిలో తొమ్మిదో ర్యాంకును కైవసం చేసుకున్నారు.

తిరుపతి విద్యార్థికి ఐసెట్‌లో ఫస్ట్‌ ర్యాంకు

చిత్తూరు విద్యార్థినికి 9వ ర్యాంకు


తిరుపతి(విద్య), ఆగస్టు 8: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం గత నెల 25న నిర్వహించిన ఐసెట్‌ ఫలితాలను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. తిరుపతికి చెందిన రెడ్డెప్పగారి కేతన్‌ 180.55 మార్కులతో ఫస్ట్‌ ర్యాంకు సాధించారు. చిత్తూరుకు చెందిన టి.పద్మావతి 153.65 మార్కులతో రాష్ట్రస్థాయిలో తొమ్మిదో ర్యాంకును కైవసం చేసుకున్నారు.ఎస్వీయూ లోకల్‌ ఏరియాలో 19,867 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా.. 17,391 మంది పరీక్ష రాశారు. వీరిలో 14,756 మంది విద్యార్థులు పాసై 84.85శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ఇక తిరుపతి జిల్లాలో పరీక్షకు రిజిస్టర్‌ చేసుకున్న 5,440 మంది విద్యార్థుల్లో 4,741మంది పరీక్ష రాయగా.. 4,042మంది విద్యార్థులు పాసయ్యారు.వీరిలో అబ్బాయిలు 2207మంది, అమ్మాయిలు 1835మంది ఉన్నారు.



టాప్‌ కాలేజీలో ఎంబీఏ చదవడమే లక్ష్యం


మాది తిరుపతిలోని భవానీనగర్‌. అమ్మానాన్న రాజ్యలక్ష్మి, హరినాథరెడ్డి (డిప్యూటీ ఇంజనీర్‌, పోలీస్‌ హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్‌). కాలికట్‌లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఇంజనీరింగ్‌ చేశా.  క్యాట్‌కు ప్రిపేరవుతున్నా. తిరుపతి ఎంఆర్‌పల్లె సర్కిల్‌లోని కౌటిల్య ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగు తీసుకున్నా. ఐఐఎంలో మంచి ర్యాంకు సాధించి.. టాప్‌ కాలేజీలో ఎంబీఏ చదవడమే నా లక్ష్యం.   

-  కేతన్‌




స్టార్టప్‌ కంపెనీ పెట్టాలన్నదే లక్ష్యం


ఎస్వీయూలో 2021లో బీటెక్‌ పూర్తిచేశా.అమ్మానాన్న రాణి, మురళీమోహన్‌రెడ్డి (అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, రైల్వేస్‌, చిత్తూరు). క్యాట్‌ పరీక్షకు సిద్ధమవుతున్నా.కౌటిల్య ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్‌ తీసుకున్నా. భవిష్యత్‌లో స్టార్టప్‌ కంపెనీ స్థాపించాలన్నది నా లక్ష్యం. 

- టి.పద్మావతి 

Updated Date - 2022-08-09T07:04:58+05:30 IST