ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని కోవిడ్ బాధితురాలి అరెస్ట్

ABN , First Publish Date - 2021-05-12T23:44:07+05:30 IST

రుయా ఆస్పత్రి ఘటన అనంతరం పోలీసుల ఓవరాక్షన్ సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఆస్పత్రిలో వైద్య సేవలపై హేమవతి అనే కోవిడ్ బాధితురాలు...

ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని కోవిడ్ బాధితురాలి అరెస్ట్

తిరుపతి: రుయా ఆస్పత్రి ఘటన అనంతరం పోలీసుల ఓవరాక్షన్ సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఆస్పత్రిలో వైద్య సేవలపై హేమవతి అనే కోవిడ్ బాధితురాలు ప్రశ్నించడంతో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సోషల్ మీడియాలో హేమవతి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆమెను అరెస్ట్ చేసి అలిపిరి స్టేషన్‌కు తీసుకు వెళ్లగా.. అక్కడికి మీడియా రావడంతో మళ్లీ హడావుడిగా హాస్పిటల్ దగ్గర వదిలిపెట్టి వెళ్లారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన విపక్ష నేతలను అరెస్ట్ చేయడం సర్వసాధారణం అయిపోయిన సందర్భంలో.. ఇవాళ కోవిడ్ రోగులను కూడా అరెస్ట్ చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా అరెస్టు చేసుకుంటూ పోవడం సరైన చర్య కాదని పలువురు విమర్శిస్తున్నారు. 



Updated Date - 2021-05-12T23:44:07+05:30 IST