శ్రీకాళహస్తి పోలీస్ స్టేషన్‌లో మందుబాబు వీరంగం

ABN , First Publish Date - 2022-02-28T20:03:38+05:30 IST

శ్రీకాళహస్తి పోలీస్ స్టేషన్‌లో ఓ మందుబాబు వీరంగం వేశాడు. పోలీసులనే హడలెత్తించాడు.

శ్రీకాళహస్తి పోలీస్ స్టేషన్‌లో మందుబాబు వీరంగం

తిరుపతి: శ్రీకాళహస్తి పోలీస్ స్టేషన్‌లో ఓ మందుబాబు వీరంగం వేశాడు. పోలీసులనే హడలెత్తించాడు. శ్రీకాళహస్తి ఒకటవ పట్టణ పీఎస్‌లో ఈ సంఘటన జరిగింది. కుమారస్వామి, తిప్పా వీధికి చెందిన ప్రదీప్ రెడ్డి నిత్యం మద్యం తాగి అందరితో గొడవ పెట్టుకుంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. అంకమ్మ ఆలయం పక్కనున్న ఓ వ్యాపారి తన నివాసం ముందు కారు నిలిపాడు. దారికి అడ్డంగా కారు ఎందుకు నిలిపావని వ్యాపారితో గొడవకు దిగాడు. బూతులు తిడుతూ కారు అద్దాలు ద్వంసం చేశాడు. దీంతో వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులను కూడా ప్రదీప్ రెడ్డి బూతులు తిట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

Updated Date - 2022-02-28T20:03:38+05:30 IST