తిరుపతిలో ఘోర ప్రమాదం తప్పింది. రామానుజం సర్కిల్ వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన ఆర్చి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఇసుకను అన్లోడ్ చేసిన లారీ డ్రైవర్ లిఫ్ట్ డౌన్ చేయకపోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన భక్తులు దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో ఆర్చి కారుపై పడింది. అయితే అదృష్టంశాత్తు కారులో ప్రయాణిస్తున్న ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఆర్చిని ఢీకొన్న తర్వాత లారీ డ్రైవర్ పరారీ అయ్యారు. అయితే కర్ణాటకకు చెందిన భక్తులు ఎలాంటి ఫిర్యాదు చేయమని కారును మాత్రం బయటకు తీయాలని పోలీసులకు తెలిపారు. గరుడ వారధి నిర్మాణ పనుల సమయంలో ఈ ఆర్చి పాక్షికంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న అధికారులు ఆ ఆర్చిని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.