తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రశాంతం

ABN , First Publish Date - 2021-04-19T06:43:29+05:30 IST

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల అబ్జర్వర్‌ దినేష్‌కుమార్‌ గిరిధర్‌లాల్‌ వెల్లడించారు.

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రశాంతం
స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన ఈవీఎలను పరిశీలిస్తున్న అధికారులు, అబ్జర్వర్‌ సమక్షంలో స్ర్టాంగ్‌ రూమ్‌కు సీలు వేస్తున్న సిబ్బంది

అబ్జర్వర్‌ దినేష్‌కుమార్‌ గిరిధర్‌లాల్‌ 

స్ట్రాంగ్‌ రూమ్‌లోకి ఈవీఎంలు 


తిరుపతి(రవాణా), ఏప్రిల్‌ 18: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల అబ్జర్వర్‌ దినేష్‌కుమార్‌ గిరిధర్‌లాల్‌ వెల్లడించారు. ఆదివారం పార్లమెంటు పరిధిలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలు పటిష్ఠ భద్రత మధ్య తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్ర్కూట్నీతోపాటు స్ట్రాంగ్‌రూమ్‌లకు సీలు వేయడం తదితరాలను రాజకీయ పార్టీల ఏజెంట్లు, ఏఆర్వోల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్జర్వర్‌ మాట్లాడుతూ ఉప ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగిందన్నారు. తాను 15 పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరినారాయణన్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ గిరీష, చిత్తూరు, అర్బన్‌ ఎస్పీలు సెంథిల్‌కుమార్‌, వెంకటఅప్పలనాయుడు, జేసీ వీరబ్రహ్మం, తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి ఏఆర్వోలు చంద్రమౌళీశ్వరరెడ్డి, చంద్రశేఖర్‌, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-19T06:43:29+05:30 IST