ఉక్రెయిన్‌ నుంచి తిరుపతి విద్యార్థిని రాక

ABN , First Publish Date - 2022-03-01T12:20:53+05:30 IST

ఉక్రెయిన్‌లో వైద్యవిద్య అభ్యసిస్తున్న తిరుపతికి చెందిన ప్రియాంక,నెల్లూరుకు చెందిన ప్రశాంత్‌ సోమవారం సోమవారం స్వస్థలాలకు చేరుకున్నారు.

ఉక్రెయిన్‌ నుంచి తిరుపతి విద్యార్థిని రాక

చిత్తూరు జిల్లా/రేణిగుంట : ఉక్రెయిన్‌లో వైద్యవిద్య అభ్యసిస్తున్న తిరుపతికి చెందిన ప్రియాంక, నెల్లూరుకు చెందిన ప్రశాంత్‌  సోమవారం  సోమవారం స్వస్థలాలకు చేరుకున్నారు. తిరుపతి విమానాశ్రయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఎం.మునికృష్ణ, నాగరాజు తదితరులు స్వాగతం పలికి ఇళ్లకు చేర్చే ఏర్పాట్లు చేశారు.ఉక్రెయిన్‌లోని ఇవనో ఫ్రాంక్‌విస్క్‌ మెడికల్‌ యూనివర్సిటీలో మూడో సంవత్సరం చదువుతున్న ప్రియాంక రాక పట్ల ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు. ప్రియాంకతో కలిపి ఉక్రెయిన్‌ నుంచి ఇప్పటిదాకా ఏడుగురు విద్యార్థులు సురక్షితంగా జిల్లాకు చేరుకున్నట్ల యింది. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. తాముండే ప్రాంతంలో యుద్ధం జరగలేదని తెలిపారు. రుమేనియా సరిహద్దు దగ్గర స్టాంపింగ్‌ వేసుకునేందుకు ఆరు గంటలపాటు వేచివుండాల్సి వచ్చిందని తెలిపారు. మన జిల్లాకు చెందిన సాగరిక, నవ్యశ్రీ, నితీష్‌, సంతోష్‌, భాను, హంపి కూడా తాను చదివే వర్శిటీలోనే చదువుతున్నారని,అయితే విమానాలు అందుబాటులో లేక రాలేకపోయారన్నారు. ఒకట్రెండు రోజల్లో అందరూ వచ్చేస్తారని చెప్పారు.

Updated Date - 2022-03-01T12:20:53+05:30 IST