తిరుపతి: నగరంలో జరిగే రైతుల మహాసభపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇది సభకు ప్రజలు రాకుండా ప్రభుత్వం అడ్డుకునే కుట్ర అని రైతులు అంటున్నారు. టీడీపీ నేతల టార్గెట్‌గా పోలీసుల ఆంక్షలు సాగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు తిరుపతికి రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. జిల్లాల్లో పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై రైతు జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.