ప్రసూతి ఆస్పత్రిలోకి తిరుపతి కార్పొరేషన్‌ ఆఫీసు

ABN , First Publish Date - 2022-08-14T06:34:35+05:30 IST

తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయ కొత్త భవనం నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈనెల 21న ప్రస్తుత కార్యాలయ ప్రాంగణంలో ఈశాన్యం దిక్కున భూమి పూజ చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది.రూ.225 కోట్ల స్మార్ట్‌ సిటీ నిధులతో డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ సిద్ధం చేసి టెండర్లు కూడా పూర్తిచేశారు.

ప్రసూతి ఆస్పత్రిలోకి తిరుపతి కార్పొరేషన్‌ ఆఫీసు

కొత్త భవనానికి 21న భూమి పూజ


తిరుపతి సిటీ/ తిరుపతి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయ కొత్త భవనం నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈనెల 21న ప్రస్తుత కార్యాలయ ప్రాంగణంలో ఈశాన్యం దిక్కున భూమి పూజ చేసేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది.రూ.225 కోట్ల స్మార్ట్‌ సిటీ నిధులతో డీటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ సిద్ధం చేసి టెండర్లు కూడా పూర్తిచేశారు.భవననిర్మాణానికి రూ.79కోట్లు, సీఓసీ సెట్‌పకోసం దాదాపు రూ.146కోట్ల వెచ్చించనున్నారు. ఈ క్రమంలో తాత్కాలిక భవనం కోసం స్విమ్స్‌ సర్కిల్‌ సమీపంలోని పాత ప్రసూతి ఆస్పత్రిని ఎంచుకున్నారు. కమిషనర్‌ అనుపమ అంజలి విజ్ఞప్తితో కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి మౌఖిక అనుమతి ద్వారా పాత ప్రసూతి ఆస్పత్రి భవనానికి నగరపాలక సంస్థ బోర్డును అధికారులు శుక్రవారం రాత్రి తగిలించేశారు. ఇది తెలుసుకున్న ఆస్పత్రి వైద్యాధికారులు డీఎంఈ అనుమతి లేనిదే తాము కేటాయించలేమని బోర్డు తొలగించగా కార్పొరేషన్‌ అధికారులు మళ్లీ బోర్డును ఏర్పాటుచేశారు. అయితే పాతభవనం నుంచి విభాగాలు మార్పుచేసేందుకు ఇప్పటివరకు యంత్రాంగానికి స్పష్టమైన ప్రణాళిక లేనట్టు తెలుస్తోంది. తాత్కాలిక భవనం కోసం 20వేల చదరపు అడుగుల నిర్మాణాన్ని గత నెలరోజులుగా అధికారులు అన్వేషించారు. స్విమ్స్‌ సర్కిల్లోని పాత మెటర్నిటీ ఆస్పత్రి, ఇస్కాన్‌ రోడ్డులోని టీటీడీ బిల్డింగ్‌తో పాటో మరో రెండు ప్రైవేట్‌ భవనాలను పరిశీలించారు.చివరకు ఖాళీగా వున్న ప్రసూతి ఆస్పత్రి అయితే ఆమోదయోగ్యంగా వుంటుందని అధికారులు భావించినట్టు తెలుస్తోంది. కొత్త భవనం పూర్తవ్వాలంటే దాదాపు రెండేళ్లు సమయం పట్టే అవకాశం వుంది. అప్పటివరకు ప్రసూతి ఆస్పతి భవనంలోనే పౌర సేవలు అందించనున్నారు. 

ఆస్పత్రిని ఖాళీ చేయించకనే బోర్డు ఏర్పాటు!

2004లో ప్రసూతి ఆస్పత్రి భవనాన్ని ఏర్పాటు చేశారు. క్రమక్రమంగా ఆస్సత్రిలో కాన్సుల సంఖ్య పెరగడంతో  ఐదేళ్ల కింద ట నూతన భవనాన్ని ఏర్పాటు చేశారు.ఆ భవనంలో కాన్సులు, సర్జరీలు చేస్తుండగా పాత ప్రసూతి ఆస్పతి భవనంలో స్ర్తీలకు సంబంధించిన వ్యాధులకు ప్రత్యేక చికిత్సలతోపాటు, కొవిడ్‌ బారిన పడిన గర్భవతులకు, బాలింతలకు చికిత్స అందిస్తున్నారు.సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి పిల్లలు పుట్టిన వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. భవనంలోని 3వ అంతస్తులో కేంద్ర ప్రభుత్వం రూ. 4 కోట్లతో ప్రత్యేకంగా నెల్స్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసి ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ప్రమాదాలకు గురైన సమయంలో వారికి ఇక్కడ ప్రత్యేక చికిత్సలు, కౌన్సిలింగ్‌ వంటి చికిత్సలందిస్తారు. సర్జరీలకు అనువైన నాలుగు ఆపరేషన్‌ థియేటర్లున్నాయి.ఇటువంటి భవనాన్ని నగరపాలక సంస్థ కార్యాలయంగా మార్చడం వలన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని వైద్యులు వాపోతున్నారు. 


Updated Date - 2022-08-14T06:34:35+05:30 IST