తిరుపతి: అటవీశాఖ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన దీక్ష 365 రోజులకు చేరుకుంది. అటవీ శాఖ కార్మికుల సమస్యలను తీర్చాలంటూ టీటీడీ ఫారెస్ట్ ఆఫీస్ ముందు భారీగా బైఠాయించారు. కార్మికులకు ఆర్పీఐ, టీడీపీ సీఐటీయూ, టీటీడీ ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. అటవీశాఖ కార్మికుల నిరసనల నేపథ్యంలో పోలీసులు, విజిలెన్స్ అధికారులు భారీగా మోహరించారు. అటవీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందంటూ అటవీశాఖ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.