త్వరలో చెన్నై-తిరుపతి మధ్య ప్రైవేటు రైలు

ABN , First Publish Date - 2020-09-20T15:07:47+05:30 IST

చెన్నై సెంట్రల్‌-తిరుపతి, ఎర్నాకుళం-కొచ్చివెల్లి మార్గాల్లో రెండు ప్రైవేటు రైలు సర్వీసులను నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. చెన్నై-తిరుపతి మధ్య నడిచే ప్రైవేటు రైలు

త్వరలో చెన్నై-తిరుపతి మధ్య ప్రైవేటు రైలు

చెన్నై : చెన్నై సెంట్రల్‌-తిరుపతి, ఎర్నాకుళం-కొచ్చివెల్లి మార్గాల్లో రెండు ప్రైవేటు రైలు సర్వీసులను నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. చెన్నై-తిరుపతి మధ్య నడిచే ప్రైవేటు రైలు వారానికి ఒకరోజు మాత్రమే నడువనుండగా, ఎర్నాకుళం- కొచ్చివెల్లి ప్రత్యేక రైలు వారానికి మూడురోజులు నడువనుంది. చెన్నై-తిరుపతి ప్రైవేటు రైలు శనివారం ఉదయం 7.20 గంటలకు చెన్నై సెంట్రల్‌ నుంచి బయల్దేరి 10.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే, తిరుపతిలో ఆదివారం ఉదయం 9.40 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12.50 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరు కుంటుంది. ఈ రైలు అరక్కోణం, రేణిగుంట స్టేషన్‌లలో మాత్రమే ఆగుతుంది. రైళ్ల సమయాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని దక్షిణ రైల్వే తెలియజేసింది.


మాస్కు ధరించకపోతే రూ.200 జరిమానా...

రైళ్లలో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని దక్షిణ రైల్వే పేర్కొంది. రైల్వేస్టేషన్‌కు వచ్చే వాళ్లు, రైళ్లలో ప్రయాణించే సమయంలోనూ ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. అలా ధరించని వారి నుంచి తలా రూ.200 జరిమానా వసూలు చేస్తామని దక్షణ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2020-09-20T15:07:47+05:30 IST