తిరుపతి రీ పోలింగ్‌కు టీడీపీ పట్టు

ABN , First Publish Date - 2021-04-19T09:49:31+05:30 IST

: తిరుపతి అసెంబ్లీ స్థానం పరిధిలో రీ పోలింగ్‌కు తన పోరాటం కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. దీని కోసం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను

తిరుపతి రీ పోలింగ్‌కు టీడీపీ పట్టు

నేడు మరోసారి ఈసీని కలవాలని నిర్ణయం


అమరావతి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): తిరుపతి అసెంబ్లీ స్థానం పరిధిలో రీ పోలింగ్‌కు తన పోరాటం కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. దీని కోసం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను సోమవారం మరోసారి కలవాలని ఆ పార్టీ నాయకత్వం నిశ్చయించింది. ఢిల్లీలో ఉన్న ఆ పార్టీ ఎంపీలు ఈసీని కలవనున్నారు. తిరుపతిలో భారీగా దొంగ ఓట్ల జాతర చోటు చేసుకోవడంతో అక్కడ శనివారం జరిగిన పోలింగ్‌ను రద్దు చేసి మళ్లీ పోలింగ్‌ జరపాలని ఆ పార్టీ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈసీ నిర్ణయం ఇంకా వెలువడలేదు. దీనితో మరోసారి కలవాలని నిర్ణయించారు. తాము సేకరించిన సాక్ష్యాలను అదనంగా ఇవ్వాలని కూడా నిశ్చయించారు. దొంగ ఓటర్‌ కార్డుల ముద్రణపై లోతుగా దర్యాప్తు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరాలని టీడీపీ నిర్ణయించింది. 

Updated Date - 2021-04-19T09:49:31+05:30 IST