తిరుపతి: నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి అవమానం జరిగింది. విగ్రహం తలపై, భుజంపై చెప్పులు ఉండటం కలకలం రేపుతోంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు... ముఖంపై జెండాను ఉంచి, తలపై చెప్పును పెట్టి దుశ్చర్యకు పాల్పడ్డారు. దీన్ని గుర్తించిన ఈస్ట్ పోలీసులు అక్కడకు చేరుకుని విగ్రహంపై నుంచి చెప్పులను తొలగించారు.