Abn logo
Jul 7 2021 @ 15:44PM

తిరుపతిలో ఉద్రిక్తతకు దారితీసిన బైక్ ర్యాలీ

తిరుపతి: ఏపీలో జాబ్ క్యాలెండర్‌పై నిరుద్యోగులు మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా తిరుపతిలో అఖిలపక్షం, యువజన సంఘాలు చేపట్టిన బైక్ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. నిరసన కారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మద్య వాగ్వాదం జరిగి తోపులాట చోటుచేసుకుంది. దీంతో నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జగన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.