Tirupathi: నగరంలో జనసేన (Janasena) పార్టీ నేతలు హరిప్రసాద్, కిరణ్‌రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సీఎం కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. పొత్తులున్నా.. లేకున్నా.. జనసేనదే అధికారమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు జనసేన నేతలు తెలిపారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే రాష్ట్రాభివృద్ధి జరుతుందని, అందుకే బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతున్నామని చెప్పారు. బీజేపీలో 90 శాతం మంది పవన్ అభిమానులే ఉన్నారని హరిప్రసాద్, కిరణ్‌రాయల్‌లు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి