తిరుపతి వర్సస్ చంద్రగిరిగా మారిన పేరూరు చెరువు వ్యవహారం

ABN , First Publish Date - 2021-11-26T04:26:25+05:30 IST

తిరుపతి వర్సస్ చంద్రగిరిగా పేరూరు చెరువు వ్యవహారం మారింది. పేరూరు చెరువు నీటిని అయిదు రోజుల క్రితం టీటీడీ డైరీ ఫాంలోకి తుమ్మలగుంట వాసులు వదిలేశారు. టీటీడీ డైరీ ఫాం నుంచి ...

తిరుపతి వర్సస్ చంద్రగిరిగా మారిన పేరూరు చెరువు వ్యవహారం

చిత్తూరు: తిరుపతి వర్సస్ చంద్రగిరిగా పేరూరు చెరువు వ్యవహారం మారింది. పేరూరు చెరువు నీటిని అయిదు రోజుల క్రితం టీటీడీ డైరీ ఫాంలోకి తుమ్మలగుంట వాసులు వదిలేశారు. టీటీడీ డైరీ ఫాం నుంచి పద్మావతి మహిళా యూనివర్శిటీకి, అక్కడ నుంచి ఎం.ఆర్.పల్లె వరకు కాలనీల్లోకి పేరూరు చెరువు నీరు వెళ్లాయి. దీంతో తిరుపతిలో పలు కాలనీలు నీట మునిగాయి. గురువారం పోలీసు బందోబస్తుతో పేరూరు చెరువుకు అధికారులు ఈ రోజు గంటి కొట్టారు. గండి కొట్టడంతో పాతకాల్వ గుండా స్వర్ణముఖిలోకి పేరూరు చెరువు నీరు వెళుతోంది. గండి కొట్టడం వల్లే తమ గ్రామంలోకి పేరూరు చెరువు నీరు వస్తోందని పాతకాల్వ గ్రామస్తులు  జాతీయ రహదారి నిర్బంధించారు. జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు ఆగిపోవడంతో ప్రయాణీకులు ఇక్కట్లు పడుతున్నారు. 

Updated Date - 2021-11-26T04:26:25+05:30 IST