ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేట్ చేతికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతితో పాటు భువనేశ్వర్, వారణాసి, అమృత్సర్, తిరుచ్చి, ఇండోర్, రాయ్పూర్, గయ, కుశీనగర్, కాంగ్రా వంటి 13 ఎయిర్పోర్టులను ప్రైవేటు రంగానికి అప్పగించబోతున్నారు. జాతీయ మానిటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపీ) కింద ప్రభుత్వం వీటి నిర్వహణను ప్రైవేటు రంగానికి అప్పగించబోతోంది. భారతీయ విమానాశ్రయాల ప్రాధికారిక సంస్థ (ఏఏఐ) డైరెక్టర్ల బోర్డు ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ చర్య ద్వారా 2024 మార్చి నాటికి చిన్న ఎయిర్పోర్టుల్లోకి రూ.3,660 కోట్ల పెట్టుబడులు ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. జీఎంఆర్, అదానీ వంటి పెద్ద సంస్థలకు బదులు మౌలిక సదుపాయల రంగంలో ఉన్న స్థానిక సంస్థలు ఈ చిన్న విమానాశ్రయాల నిర్వహణకు ముందుకు వస్తాయని భావిస్తున్నారు.