కార్వీ ఎండీని పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు

ABN , First Publish Date - 2021-08-29T17:41:41+05:30 IST

కార్వీ ఎండీ పార్ధసారధిని ఆదివారం పోలీసులు కస్టడిలోకి తీసుకోనున్నారు.

కార్వీ ఎండీని పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు

హైదరాబాద్: కార్వీ ఎండీ పార్ధసారధిని ఆదివారం పోలీసులు కస్టడిలోకి తీసుకోనున్నారు. పార్థసారథిని మరో రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. గతంలో రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని కీలక అంశాలు సేకరించిన సీసీఎస్ పోలీసులు..ఇవాళ చంచల్ గూడ జైలు నుంచి మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. స్కాం మొత్తం రూ. 2,700 కోట్లుగా పోలీసులు తేల్చారు. రూ. 1200 కోట్ల బ్యాంకు రుణం ఎగవేశారని, కార్వీ ఆస్తులన్నీ బ్యాంకుల్లో పెట్టినట్టుగా గుర్తించారు. పార్థసారధి కస్టమర్స్ షేర్స్‌ను కంపెనీ షేర్స్‌గా చూపించి బ్యాంకు రుణాలు పొందారు. ఇవాళ విచారణలో కార్వీ ఆడిట్ రీపోర్ట్, బ్యాంకు లావాదేవీలపై సీసీఎస్ పోలీసులు కూపీ లాగనున్నారు. 

Updated Date - 2021-08-29T17:41:41+05:30 IST