TTD: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-08-15T02:00:39+05:30 IST

తిరుమల (Tirumala) పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. వరుస సెలవులతో ఆదివారం కూడా భక్తులు కిక్కిరిశారు.

TTD: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: తిరుమల (Tirumala) పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. వరుస సెలవులతో ఆదివారం కూడా భక్తులు కిక్కిరిశారు. సాయంత్రం నాలుగు గంటల సమయానికి 50,443 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యావనంలోని తొమ్మిది షెడ్లు భక్తులతో నిండిపోయి క్యూలైన్‌ గతంలో ఎన్నడూ లేనవిధంగా లేపాక్షి, షాపింగ్‌ కాంప్లెక్స్‌, ఫైర్‌స్టేషన్‌, నందకం, వరాహస్వామి, సేవాసదన్‌ మీదుగా క్యూలైన్‌ ఆక్టోపస్‌ భవనం సమీపంలోని రింగ్‌రోడ్డు వరకు దాదాపు మూడు కిలోమీటర్లుకుపైగా క్యూలైన్‌ వ్యాప్తించింది. వీరికి దాదాపు 40 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభిస్తుంది. క్యూలైన్‌ ప్రారంభమయ్యే రింగ్‌రోడ్డులో భక్తులను విజిలెన్స్‌, పోలీసులు బృందాలుగా క్యూలైన్‌లోకి అనుమతించారు. వృద్ధులు, పిల్లలతో వచ్చిన భక్తులు క్యూలైన్‌లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరికొంతమంది భారీ క్యూలైన్‌ను చూసి తిరుమల నుంచి వెనుదిరిగారు. ఆలయ మాడవీధులు, పరిసర ప్రాంతాలు, అఖిలాండం, లడ్డూకౌంటర్‌, అన్నదాన భవనం, బస్టాండ్‌ వంటి ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. 

Updated Date - 2022-08-15T02:00:39+05:30 IST