తిరుమలలో భక్తుల ధర్నాపై స్పందించిన టీటీడీ

ABN , First Publish Date - 2021-07-11T17:49:26+05:30 IST

తెలంగాణ ప్రజాప్రతినిధులు సిపారస్సు లేఖలను స్వీకరించిన కారణంగా టీటీడీ అదనపు ఈవో కార్యాలయం వద్ద భక్తులు ధర్నాకు దిగిన ఘటనపై టీటీడీ స్పందించింది.

తిరుమలలో భక్తుల ధర్నాపై స్పందించిన టీటీడీ

తిరుమల: తెలంగాణ ప్రజాప్రతినిధులు సిపారస్సు లేఖలను స్వీకరించిన కారణంగా టీటీడీ అదనపు ఈవో కార్యాలయం వద్ద భక్తులు ధర్నాకు దిగిన ఘటనపై టీటీడీ స్పందించింది. తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలపై దర్శనాలను జారీ చేయడం దుష్ప్రచారమే అని టీటీడీ అధికారులు తెలిపారు. నిబంధనల మేరకు ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకుంటున్నామని అన్నారు. ఒక్కో రోజు ఎక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు జారి చేసిన సమయంలోనే.... తిరస్కరణ జరుగుతుందని చెప్పారు. కొందరు ప్రజాప్రతినిధుల విజ్ఞాపన మేరకు వారి సిపారస్సు లేఖలపై ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను మంజూరు చేశామని టీటీడీ అధికారులు తెలియజేశారు. 

Updated Date - 2021-07-11T17:49:26+05:30 IST