నేటి శ్రీవారి హుండీ ఆదాయం రూ. 46 లక్షలు

ABN , First Publish Date - 2020-08-05T04:03:33+05:30 IST

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధిలో భక్తుల రద్దీ తగ్గింది.

నేటి శ్రీవారి హుండీ ఆదాయం రూ. 46 లక్షలు

తిరుమల : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధిలో భక్తుల రద్దీ తగ్గింది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య అమాంతం తగ్గిపోయింది. చిత్తూరు జిల్లాలో మరీ ముఖ్యంగా తిరుపతి నగరంలో కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో దర్శనానికి రావడానికి భయపడుతున్నారు. మరోవైపు టీటీడీ కూడా రోజుకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమితిస్తోంది. దీంతో ఈ ప్రభావం హుండీ ఆదాయం కూడా పడింది. 


కరోనాకు ముందు రోజుకు లక్షల మంది వెంకన్నను దర్శించుకుంటుండగా.. ఇప్పుడు మాత్రం ఐదువేలకు లోపే భక్తులు తిరమలకు వస్తున్నారు. ఇవాళ 3962 మంది భక్తులు వెంకన్నను దర్శించుకున్నారు. నేటి శ్రీవారి హుండీ ఆదాయం రూ. 46 లక్షలు అని టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 1074 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Updated Date - 2020-08-05T04:03:33+05:30 IST