Abn logo
Nov 22 2020 @ 03:14AM

వేడుకగా వెంకన్న పుష్పయాగం

ఆంధ్రజ్యోతి, తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామికి శనివారం పుష్పయాగం వైభవంగా జరిగింది. కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రం సందర్భంగా ఈ ఉత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. 14 రకాల 7 టన్నుల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి పుష్పార్చన చేశారు. కాగా.. తిరుమలలోని గోగర్భం సమీపంలో ఉన్న పార్వేటమండపం వద్ద ఆదివారం భక్తుల్లేకుండానే కార్తీక వన భోజన కార్యక్రమం జరుగనుంది. 


Advertisement
Advertisement
Advertisement