Tirumalaలో కళ్యాణమస్తు వాయిదా?

ABN , First Publish Date - 2022-08-07T04:14:12+05:30 IST

ఆగస్టు 7న నిర్వహించే కళ్యాణమస్తు (KalyanaMastu)ను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వాయిదా వేసినట్లు తెలుస్తోంది. రా....

Tirumalaలో కళ్యాణమస్తు వాయిదా?

తిరుమల (Tirumala): ఆగస్టు 7న నిర్వహించే కళ్యాణమస్తు (KalyanaMastu)ను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వాయిదా వేసినట్లు తెలుస్తోంది.  రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీన ఉచితంగా సామూహిక వివాహాలు (Weddings) నిర్వహిస్తామని టీటీడీ ప్రకటించింది. ఆగస్టు 7వ తేదీన ఉదయం 8.07 గంటల నుండి 8:17 నిమిషాల మధ్య అనురాధ నక్షత్రం సింహా లగ్నంలో వివాహాలు జరిపించాలని ముహూర్తం ఖరారు చేసింది. అయితే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో కళ్యాణమస్తు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తరువాత కళ్యాణమస్తు నిర్వహణకు తేదీ ఖరారు చేయనున్నట్లు టీటీడీ వర్గాలు అంటున్నాయి. కానీ కల్యాణమస్తును మాత్రం వాయిదా వేస్తున్నట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించకపోవడంతో భక్తుల్లో అయోమయ, గందరగోళ పరిస్థితి నెలకొంది. స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. 

Updated Date - 2022-08-07T04:14:12+05:30 IST