తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనదారులపై చిరుత దాడి

ABN , First Publish Date - 2020-08-05T01:48:14+05:30 IST

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనదారులపై చిరుత దాడి

తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనదారులపై చిరుత దాడి

తిరుమల: తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనదారులపై చిరుత దాడి చేసింది. అలిపిరి నుంచి 10వ కిలో మీటర్ వద్ద ద్విచక్ర వాహనదారుడిపై చిరుత దాడి చేసినట్లు పెట్రోలింగ్ సిబ్బంది తెలిపారు. చిరుత దాడి నుంచి వాహనదారుడు తృటిలో తప్పించుకున్నారు. ఘటనా స్థలానికి పెట్రోలింగ్ సిబ్బంది వెళ్లి చిరుత దాడిలో గాయపడిన వాహనదారుడిని తిరుమలకు పంపించారు. చిరుత వరుస దాడి నేపథ్యంలో ద్విచక్ర వాహనాలను గుంపులుగా వదులుతున్నట్లు భద్రతా సిబ్బంది తెలిపారు.

Updated Date - 2020-08-05T01:48:14+05:30 IST