Advertisement
Advertisement
Abn logo
Advertisement

తిరుమలకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఈవో

తిరుపతి: తిరుపతి-తిరుమల మధ్య ప్రయాణించేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. రెండవ ఘాట్‌రోడ్డులో 13, 15 కిలోమీటర్ల వద్ద కొండచరియలు విరిగిపడి రక్షణ గోడలు, రోడ్లు ధ్వంసమయ్యాయని, వీటి పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు తిరుపతి నుంచి తిరుమలకు 2,300 వాహనాలు, తిరుమల నుంచి కిందకు 2 వేల వాహనాలు ప్రయాణించాయని తెలిపారు. చెన్నైకి చెందిన ఐఐటీ ప్రొఫెసర్లు తిరుమలకు చేరుకుని విరిగిపడిన కొండచరియలను పరిశీలించారని, ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్లు కూడా గురువారం ఘాట్‌రోడ్లను పరిశీలిస్తారన్నారు. ఐఐటీ నిపుణులు పూర్తిస్థాయిలో పరిశీలించి సమర్పించే నివేదిక తర్వాత తదుపరి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఘాట్‌రోడ్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంజినీరింగ్‌, సెక్యూరిటీ, ఫారెస్ట్‌, ఆరోగ్యం తదితర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జవహర్‌రెడ్డి ఆదేశించారు.

Advertisement
Advertisement