Tirumala: 8 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-07-30T02:17:48+05:30 IST

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.7వ తేదీన అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

Tirumala: 8 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.7వ తేదీన అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ జరిగే దోషాలతో ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా మూడురోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 8న పవత్రాల ప్రతిష్ట, 9న పవిత్ర సమర్పణ, 10న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

Updated Date - 2022-07-30T02:17:48+05:30 IST