తిరుమల: తిరుమలలో మద్యం సీసాలు కలకలం రేపుతున్నాయి. శ్రీవారి ఆలయానికి సమీపంలో ఖాళీ మద్యం సీసాలు లభించాయి. రాంభగీచ అతిథి గృహం దగ్గర బైక్‌లో ఖాళీ మద్యం సీసాలు పడి ఉన్నాయి. వెంటనే టీటీడీ విజిలెన్స్ అధికారులు బైక్‌ను సీజ్ చేసి విచారణ జరుపుతున్నారు.